Showing posts with label srimannarayana bowli carnatic telugu. Show all posts
Showing posts with label srimannarayana bowli carnatic telugu. Show all posts

May 04, 2007

శ్రీమన్ నారాయణ

రాగం:బౌళి
తాళం:ఆది
శ్రీ అన్నమాచార్య విరచితం


పల్లవి
*****
శ్రీమన్ నారాయణ శ్రీమన్ నారాయణ

శ్రీమన్ నారాయణ నీ శ్రీపాదమే శరణు

చరణం

*****
కమలాసతి ముఖకమల కమలహిత కమలప్రియ కమలేక్షణా

కమలాసనహిత గరుడగమన శ్రీ కమలనాభ నీ పదకమలమే శరణు 1

పరమ యొగిజన భాగధెయ శ్రీ పరమపురుషా పరాత్పరా

పరమాత్మా పరమాణురూప శ్రీ తిరువేంకటగిరిదేవా శరణు 2

Srimannarayana.mp3