రాగం :- ఆభోగి
అన్నమాచార్య సంకీర్తన
మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఖమొంద నేల
జుట్టెడు కడుపుకై చొరని చొట్లు చొచ్చి
పట్టెడు కూటికై బతిమాలి
పుట్టిన చోటికె పొరలి మనస్సు పెట్టి
వట్టి లంపటము వదల నేరడు గాన
అందరిలో పుట్టి
అందరిలో చేరి
అందరి రూపములు అటు తానయి
అందమయిన శ్రీవేంకటాద్రీశు సేవించి
అందరాని పదములు అందెనటు గాన
రాగం :- బృందావన సారంగ
అన్నమాచార్య సంకీర్తన
ఎంత మాత్రమున యెవ్వరు తలచిన అంత మాత్రమేనీవు
అంతరాంతరము లెంచి చూడ విండంతె నిప్పటి అన్నట్టు
కొలుతురు మిము వైష్ణవులు కూరిమితొ విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మాం బనుచు
తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడనుచు
సరినన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు
దరశనములు మిము నానావిధులనుతలపుల కొలదుల భజింతురు
సిరుల మిము యె అల్పబుద్ధి తలచిన వారికి అల్పం బవుదు
గరిమల మిము యె ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు
నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగిరథి దరిబావుల ఆ జలమే ఊరిన ఎట్లు
శ్రీవెంకటపతి నీవయితె మము చేకొని ఉన్న దైవమని
ఈ బలదె నీ శరనమని యెదను ఇదియె పరతత్వము నాకు(2).