October 18, 2007

అలుపన్నది ఉందా

Alupannadi.mp3


అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలుపులకు
లలా లలా లల.......

నాకొసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకై సిరులే పిలచి దాసోహమె అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు
కలలను తేవ నా కన్నులకు
లలా లలా లల......

అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు

నీచుపులే తడిపె వరకు ఎమయినదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఎడేడు లోకాలా ద్వారాల తలుపులు తెరిచే తరుణం కోరకు
ఎదురుగ నడిచే తొలి ఆశలకు
లలా లలా లల.....

అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలుపులకు
లలా లలా లల.......

October 15, 2007

హ్యాపి డేస్

చాలా రోజుల తర్వత నాకు తెలుగులో నచ్చిన పాటలు ఈ హ్యాపి డేస్ సినిమాలోనివి.మీరు ఇక్కడ వినచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు.అన్ని పాటలోని భావం నాకు చాల నచ్చింది.కాలేజిని గుర్తుచేసేవిగా ఉన్నయి అన్ని...మీకు మీ కాలేజి రోజులు గుర్తుకువస్తాయి ఈ పాటలు వింటే.సంగీతం,రచన రెండు బావున్నాయి.

సంగీతం : మిక్కి జే. మేయర్

1.జిల్ల్ జిల్ల్ జిగ

2. అంతా నీ మాయ

3.యే చీకటి

4.ఓ మై ఫ్రేండ్

5.హ్యాపి డేస్

పాటలు డౌన్లోడ్ చేస్కొడానికి ఎస్నిప్స్ లోకి లాగిన్ కాండి.

October 01, 2007

హంసధ్వని రాగం

హంసధ్వని రాగం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు :

1.ఇది ధీర శంకరాభరణ జన్యం(జన్య రాగం అంటే మెళకర్త రాగం అయిన శంకరాభరణ రాగంలో ని కొన్ని స్వరాలతో కూర్చడం జరిగింది ).
2.శుభప్రదంగ పరిగనిణ్చే రాగల్లో ఒకటి .
3.హాస్యం వీరం వంటి భావాలను వ్యక్తపరచడానికి ఈ రాగన్ని ఉపయోగించటం జరుగుతుంది.

నాకు తెలిసిన కొన్ని కీర్తనలు ఈ రాగంలో

1.వాతాపి గణపతిం
2.అభిష్ట వరదశ్రీ
3.రఘునాయక
4.చాలదా హరినామ
5.గజవదనా బేడువే

మరి కొన్ని కీర్తనల కొసం ఇక్కడ చూడండి.

వర్ణం :- జలజాక్షి
పైన రాసిన పాటల్ మీరు ఇక్కడ వినచ్చు .



Powered by eSnips.com