
రేపటితో మనకు అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి అరవై యేళ్ళు పూర్తి అవుతుంది.ఈ అరవై యేళ్ళ స్వాతంత్రంలో నేను చూసింది ఇరవైఐదు యేళ్ళు మాత్రమే(ఎందుకంటే నేను పుట్టింది అప్పుడే కాబట్టి).ఈ ఇరవైఐదు యేళ్ళలో మొదటి పదేళ్ళు నేనంటె ఎమో నాకే తెలియదు ఇంక స్వాతంత్రం గురించి ఎంచెప్తాను.మిగిలిన పదిహేను యెళ్ళలో చివరి ఐదు యెళ్ళలో నేను చూసిన పెద్ద మార్పు " ఉద్యోగాలు" అవును అందరికి చాల బాగా ఉద్యోగాలు వస్తున్నా యి.దీనికి స్వాతంత్రనికి ఏమిటి సంబంధం అనుకుంటున్నారా అక్కడికే వస్తున్న,మరి ఇంక నేనేమి చెప్పను స్వాతంత్రం గురించి అది వచ్చాక కదా నేను పుట్టింది.అప్పుడు జరిగిన విషయాలన్ని మనం చిన్నపుడే చదివేశాం,వినేశాము.
ఆగస్టు పదిహేను అంటే నాకు కొన్ని చిన్నపటి విషయాలు గుర్తొస్తాయి .ముందుగా ఆ రోజు స్కూల్లో జండా వందనం,తర్వతా వాళ్ళు ఇచ్చే చాకొలెట్లు, ఇంకా అ రోజు స్కూల్కి సెలవు.ఆ రోజు డిడిలో ప్రసారమయే లైవె ప్రొగ్రం ఢిల్లినుంచి ,మన అద్రుష్టం బావుంటే ఒక మంచి సినిమా డిడిలో.ఇంక కాలేజి కి వచ్చాక అది ఒక సెలవు దినంగ మత్రమే గుర్తుండి పొయింది.
ఈ ఆగస్టు పదిహేను సందర్భంగా నేనునా బ్లాగులో కొన్ని పాటలు,వీడియొలు పొస్ట్ చేద్దమనుకున్నా.ముందుగా ఈ జణగణమణ వీడియొ చూడండి.ఈ వీడియొ కి ఒక ప్రత్యేకత ఉంది,కర్నాటక సంగీతం మరియు హిందుస్తాని సంగీతంలో దిగ్గజాల చేత జణగణమణ పాడించటం జరిగింది.
వందేమాతరం అంటున్న ఈ రహమాన్ వీడియొ చూడండి ,అన్ని రాష్ట్రల వారి సంస్క్రుతి ఆధారంగ చేసుకొని చిత్రికరించటం జరిగింది .