పెళ్లాడుతావురా అంటే నాకు తెలీదు.కానీ,మరి నేను చిన్నవాడిని చితకవాడిని కానుగా అందుకని నాకు అన్ని తెల్సుగా.అందుకని సరే మీ గానపసూనాంబ ని నేను పెళ్లాడుతావురా లెండి అని చెప్పేసాను .అప్పుడేమో ఆ గానపసూనాంబ నవ్వేసి ఛీ అంది.చిన్నపిల్ల అనుకో.అయిన ఓ ఫదేళ్లు ఉంటాయి .గానపసూనంబ నీ పేరేమిటి అని అడిగాను. సీ.గానపసూనంబ అని చెప్పింది.

ఎందుకో మరి నేను మేల్కుని ఉన్నపుడు ఇలాగే తిడతారు అందరు .నిద్రపోతున్నపుడు నేను ఎంతో ముద్దొస్తానంట మళ్లీ ఏంచేతనూ .ఏంచేత అంటే ఏంచెప్తాం .అంటే ఏమీ చెప్పలేము అనమట.వీళ్లు అన్ని ఇలాగే మట్లాడుతారు

పండుగా వచిందని వాళ్ళు మనకి కొత్తబట్టలు అవీ కుట్టించుకుంటారు .ఏదో ముస్తాబు అది చేసి సరదాగ ఉంటారు .కానీ ఒకటి -- పోనీ అని మనం ఉరుకుంటే ,తలంటి పొసేస్తానంటారు .దానికి సరే అంటే ఒళ్ళు నుల్చుకో అని పేచీ పెడతారు .పండగా కాబట్టి ఇలా వాళ్ళు అల్లరి చేసిన మనం కోపడకూడదు.ఎందుకంటే ,వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి.మనం తలాంటి పోస్కుని వాళ్ళకి దన్నం పెట్టి ముద్దివ్వాలి .అది సంగతి .
రెండు జల్ల సీత ఒక జడ ముందుకు ఒక జడ వెనక్కు వెస్కుని వెల్తుంది అది ముందుకు వెల్తుందొ వెనక్కి వెల్తుందొ అర్తమే కాదు

