తాళం : ఆది
అన్నమాచర్య సంకీర్తన
పల్లవి
*****
వాడే వెంకటాద్రి మీద వర దైవము
పొడిమితొ పొడచూపే పొడవైన దేహము
చరణం
*****
ఒక్కొక్క రోమ కూపాననొగి బ్రహ్మాండ కోట్లు
పికటిల్ల వెలుకొందే పెనుదైవము
పక్కనను తనలోని పదునాల్గు లోకాలు
తొక్కి పదమున గొలిచే దొడ్డ దైవము
సరుస శంఖు చక్రాలు సరిబట్టియ సురుల
తరగి పడవేసిన దండి దైవము
సిరి యురమున నిల్చె శ్రీ వేంకటేశుడై
శరణగతులగాచే సతమైన దైవము
No comments:
Post a Comment