July 26, 2007

రఘునాయక


రాగం: హంసధ్వని
29 ధీర శంకరాభరణ జన్యం

ఆ : స రి2 గ3 ప ని3 స
ఆవ: స ని3 ప గ3 రి2 స
తాళం: ఆది

త్యాగరాజ సంకీర్తన

పల్లవి
*******
రఘునాయకా నీ పాద యుగ రాజీవముననే విడజాల శ్రీ


అనుపల్లవి
***********
అఘజాలమూల బారద్రోలినన్ ఆదరింప నీవే గతి గాదా శ్రీ


చరణం
*******
భవ సాగరము దాటలేక నే వలు గాసిబడి నీ మరుగు జేరితిని

అవనీజాధిప శ్రిత రక్షక ఆనందాకరా శ్రీ త్యాగరాజనుత

Meaning:-

pallavi :-Oh! One who is unique among the Raghuvamsam! I will never release your lotus feet.
Anupallavi :-Who but you can rid me of the accumulated sins and offer me shelter? Mundane life (the ocean of samsaara) is replate with trials and tribulations.
Charanam :-To cross this vale of sorrow, I have come to you. O Lord of Seeta! Protector of those seeking refuge! Bestower of joy! bless tyagaraaja !!.

బోమ్మ :-బాపు బోమ్మ

July 17, 2007

That's the way it is

This is a nice song sung by celine dione.I like this song because of its lyrics...they are good.Do check the song and listen along with the lyrics.

Song :-
I can read your mind and I know your story
I see what youre going through
Its an uphill climb, and Im feeling sorry
But I know it will come to you

So not surrender cause you can win
In this thing called love
When you want it the most there's no easy way out
When youre ready to go and your heart left in doubt
Dont give up on your faith Love comes to those who believe it
And thats the way it is

When you question me for a simple answerI dont know what to say,
But its plain to see, if you stick togetherYoure gonna find a way, yeah
So not surrender cause you can win
In this thing called love
When you want it the most theres no easy way out
When youre ready to go and your hearts left in doubt
Dont give up on your faith Love comes to those who believe it
And thats the way it is

When life is empty with no tomorrow And loneliness starts to call
Baby, dont worry, forget your sorrow cause loves gonna conquer it all,
When you want it the most theres no easy way out
When youre ready to go and your hearts left in doubt
Dont give up on your faithLove comes to those who believe it
And thats the way it is (2)


Celion Deon - That...

July 11, 2007

పరమపద సోపాన పఠం

పెళ్ళి పుస్తకాన్ని పరమపద సోపన పఠంతో పొల్చి,అందులో ఉన్న నిచ్చెనలను పెళ్ళన్ని పొగడడంతో వచ్చే 'ప్రొమొషన్లుగా',పాములను తను పెట్టే కష్టాలతో పొల్చడం చాలా తమషాగా ఉంది.ఈ బొమ్మ చూడండి మీకు నవ్వురాకమానదు.






బొమ్మలు:- బాపు కార్టూన్స్-1

July 10, 2007

'ప్రేమ' లో రకాలు

ప్రేమ లో రకాలు బాపు గారి బొమ్మల్లో.రకరకాలయిన ప్రేమలని బాపు గారి బొమ్మల్లో చూడండి :)
బొమ్మలు:-బాపు గారి కార్టున్స్-1

July 05, 2007

పంచరత్నకీర్తనల విశేషాలు

పంచరత్న(అంటే ఐదు రత్నాలు)కీర్తనలు కర్ణాటక సంగీతంలో చాలా ప్రసస్తి చెందినవి.ఈ కీర్తనలు త్యాగరాజ స్వామిచే విరచితమయినవి.ఈ కీర్తనలని వాటి రాగం యొక్క భవాన్ని మరియు సందర్భాన్ని ద్రుష్టిలో పెట్టుకుని వ్రాయడం జరిగింది.ఐదు కీర్తనలని రాగ ,తానం ,పల్లవి విధానం లో మరియు ఆది తాళం లో సమకూర్చడం అయినది.
మొదటిది :- జగదానంద కారక -- నాట రాగం
రెండవది :- దుడుకుగల నన్నె దొర -- గౌళ రాగం
మూడవది :- సాదించనే ఓ మనసా -- ఆరభి రాగం
నల్గవది :- కనకన రుచిరా -- వరాళి రాగం
ఐదవది :- ఎందరో మహనుభావులు -- శ్రీ రాగం

ఈ ఐదు రాగలని ఘన రాగలు అని అంటారు అందుకే కర్ణాటక సంగీతాన్నిఘనపంచకం అని కూడ పిలవచ్చు.వీణ మీద తానం వాయించడానికి అనువుగా ఉంటాయి కాబట్టి వీటిని ఘన రాగలు అంటారు .


జగదానంద కారక :- మాములుగా సంగీత కచేరీలను నాటరాగం తో ప్రారంభించటం ఆనవాయితి .ఈ కీర్తన లో త్యాగరాజుల వారు రామచంద్రుని గురించి పొగడుతు వ్రాసారు,ఇది పూర్తిగా సంస్క్రుతం లో రచించబడినది. నాట మరియు వరాళి రాగలు వెయ్యి సంవత్సరములకంటే పూరతన మయినవి .


దుడుకుగల నన్నె దొర :- రెండవదైన దుడుకుగల,ఇందులో ఆయన తన జీవితంలో చేసిన తప్పుల గురించి చెప్తు రాములవారిని క్షమించమని కోరారు.ఆయన చేసిన తప్పులను వివరించారు.

సాధించనే ఓ మనసా :- మూడవది అయిన సాధించనే, ఇందులో అయిన భగవంతుని యొక్క గొప్పతనన్ని చాలా అందంగా,చక్కగా వర్ణించారు. మొదటి ఐదు చరణాలు శ్రీ కృష్ణుని గొప్పతనాన్ని ,ఆరవ చరణం రాముడి ఘనతను మిగిలిన చరణాలు వేంకటేశ్వర స్వామిని పొగడుతు వ్రాశారు .
అది ఎలా అంటే:- ఓ హరి !! నువ్వు చాల తెలివయిన వాడివి నీ తల్లి తండ్రులయిన దేవకి వసుదేవులను గోపికలను అందరిని నీ చమత్కారం తో దాసులను చేసి ,నీ అమాయకపు నవ్వుతో యశోదా దేవిని మాయ చేశావు. నీ భక్తుల మీద నీకున్న ఆపారమైన ప్రేమని,నీ సద్గుణాలని నా హ్రుదయకమలమునందు పూజిస్తు నేను ఆలాపిస్తునాను.
ఓ రామచంద్ర !! రఘువంశ తిలక ,మ్రుదుభాషి,శేషశయన మీద పవళించుచు,కమలాల వంటి కనులు ఉన్న తండ్రి నన్ను బ్రోవుమయ్య.

కనకన రుచిరా :- ఈ కీర్తనను చాల తక్కువగా ఆలాపించటం జరుగుతుంది .దీన్ని గురువు దగ్గర అభ్యసిస్తే గురు శిష్యుల మధ్య భేదభవాలు కలుగుతాయి అని ఒక నానుడి.అందుకనే ఈ కీర్తనను నేర్పించడం చాలా అరుదు.ఇందులో ధ్రువుని కధ కి రామయణానికి ఉన్న పొలికలను వర్ణించడం జరిగింది.


ఎందరో మహనుభావులు :- ఈ కీర్తనలో త్యాగరాజుల వారు ,ప్రపంచములో ఉన్న గొప్పవారందరికి తన వందనాలు తెలిపారు.ఈ కీర్తన చాలా పేరుపొందినది.


విషయ సంగ్రహం :- వికీ,కర్నాటిక్