పంచరత్న(అంటే ఐదు రత్నాలు)కీర్తనలు కర్ణాటక సంగీతంలో చాలా ప్రసస్తి చెందినవి.ఈ కీర్తనలు త్యాగరాజ స్వామిచే విరచితమయినవి.ఈ కీర్తనలని వాటి రాగం యొక్క భవాన్ని మరియు సందర్భాన్ని ద్రుష్టిలో పెట్టుకుని వ్రాయడం జరిగింది.ఐదు కీర్తనలని రాగ ,తానం ,పల్లవి విధానం లో మరియు ఆది తాళం లో సమకూర్చడం అయినది.
మొదటిది :- జగదానంద కారక -- నాట రాగం
రెండవది :- దుడుకుగల నన్నె దొర -- గౌళ రాగం
మూడవది :- సాదించనే ఓ మనసా -- ఆరభి రాగం
నల్గవది :- కనకన రుచిరా -- వరాళి రాగం
ఐదవది :- ఎందరో మహనుభావులు -- శ్రీ రాగం
ఈ ఐదు రాగలని ఘన రాగలు అని అంటారు అందుకే కర్ణాటక సంగీతాన్నిఘనపంచకం అని కూడ పిలవచ్చు.వీణ మీద తానం వాయించడానికి అనువుగా ఉంటాయి కాబట్టి వీటిని ఘన రాగలు అంటారు .
జగదానంద కారక :- మాములుగా సంగీత కచేరీలను నాటరాగం తో ప్రారంభించటం ఆనవాయితి .ఈ కీర్తన లో త్యాగరాజుల వారు రామచంద్రుని గురించి పొగడుతు వ్రాసారు,ఇది పూర్తిగా సంస్క్రుతం లో రచించబడినది. నాట మరియు వరాళి రాగలు వెయ్యి సంవత్సరములకంటే పూరతన మయినవి .
దుడుకుగల నన్నె దొర :- రెండవదైన దుడుకుగల,ఇందులో ఆయన తన జీవితంలో చేసిన తప్పుల గురించి చెప్తు రాములవారిని క్షమించమని కోరారు.ఆయన చేసిన తప్పులను వివరించారు.
సాధించనే ఓ మనసా :- మూడవది అయిన సాధించనే, ఇందులో అయిన భగవంతుని యొక్క గొప్పతనన్ని చాలా అందంగా,చక్కగా వర్ణించారు. మొదటి ఐదు చరణాలు శ్రీ కృష్ణుని గొప్పతనాన్ని ,ఆరవ చరణం రాముడి ఘనతను మిగిలిన చరణాలు వేంకటేశ్వర స్వామిని పొగడుతు వ్రాశారు .
అది ఎలా అంటే:- ఓ హరి !! నువ్వు చాల తెలివయిన వాడివి నీ తల్లి తండ్రులయిన దేవకి వసుదేవులను గోపికలను అందరిని నీ చమత్కారం తో దాసులను చేసి ,నీ అమాయకపు నవ్వుతో యశోదా దేవిని మాయ చేశావు. నీ భక్తుల మీద నీకున్న ఆపారమైన ప్రేమని,నీ సద్గుణాలని నా హ్రుదయకమలమునందు పూజిస్తు నేను ఆలాపిస్తునాను.
ఓ రామచంద్ర !! రఘువంశ తిలక ,మ్రుదుభాషి,శేషశయన మీద పవళించుచు,కమలాల వంటి కనులు ఉన్న తండ్రి నన్ను బ్రోవుమయ్య.
కనకన రుచిరా :- ఈ కీర్తనను చాల తక్కువగా ఆలాపించటం జరుగుతుంది .దీన్ని గురువు దగ్గర అభ్యసిస్తే గురు శిష్యుల మధ్య భేదభవాలు కలుగుతాయి అని ఒక నానుడి.అందుకనే ఈ కీర్తనను నేర్పించడం చాలా అరుదు.ఇందులో ధ్రువుని కధ కి రామయణానికి ఉన్న పొలికలను వర్ణించడం జరిగింది.
ఎందరో మహనుభావులు :- ఈ కీర్తనలో త్యాగరాజుల వారు ,ప్రపంచములో ఉన్న గొప్పవారందరికి తన వందనాలు తెలిపారు.ఈ కీర్తన చాలా పేరుపొందినది.
విషయ సంగ్రహం :- వికీ,కర్నాటిక్
No comments:
Post a Comment