September 21, 2007

मैं ज़िंदगी का साथ निभाता चला गया

ఈ పాట ' हम दोनो ' అనబడే హింది చిత్రంలోనిది.ఈ చిత్రంలో అన్ని పాటాలు బావున్నాయి.ఈ పాటలోని సాహిత్యం నాకు చాల నచ్చింది .జీవితంలో ఏమి జరిగిన దానిని మనకు అనుగుణంగా మల్చుకోవాలి,దొరికిన దానితో సంతోష పడి లేని దానిని మర్చిపొమ్మని అంటాడు రచయిత. రఫి గారి గాత్రం ఈ పాటకు ఇంకా అందాన్ని ఇచ్చింది. పాటను ఇక్కడ వినండి ఇక్కడ చూడండి .

Lyricist : Saahir Ludhiyanvi
Singer :Mohhamad Rafi
Music Director :Jaidev
Movie :Hum Dono - 1961

मैं ज़िंदगी का साथ निभाता चला गया हर फ़िक्र को धूए में उड़ाता चला गया

बार बादियो का सोग मनाना फ़ूज़ूल था बार बादियो का जश्न मनाता चला गया

जो मिल गया उसी को मुक़द्दर समाज़ लिया जो खो गया मैं उस को भूलाता चला गया

घम और कुशी मे फराक न महसूस हो जहामे दिल को उसी मकाम पे लाता चला गया

Hum Dono_Main Zind...

September 18, 2007

గూగుల్ హార్డ్ డ్రేవ్

ఇప్పటికే మీకందరికి తెలిసి ఉండచ్చు ఈ గూగుల్ హార్డ్ డ్రేవ్ గురించి.ఇది మీ కంప్యుటర్లో ఉన్న హార్డ్ డ్రేవ్ కి ఒక కొత్త జీమైల్ హార్డ్ డ్రేవ్ ని జతపరుస్తుంది.దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీ జీమైల్ లో ఉన్న డాటా అంతా ఇందులోకి కాపి అవుతుంది .మీ జీమైల్లో ఉన్న డాటా అంతా ఈ జీమైల్ హార్డ్ డ్రేవ్ ద్వార పొందవచ్చు .ఇది ఒక విర్త్యువల్ హర్దిస్క్ లాంటిది.ఇందులో ఇంకాకొన్ని లొసగులు ఉన్నప్పటికి దీన్ని మనం బాగ వాడుకొవచ్చు . దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి .

గూగుల్ హార్డ్ డ్రేవ్

గూగుల్ హార్డ్ డ్రేవ్ బ్లాగు

డౌన్లోడ్ చేసుకోండి

September 13, 2007

శ్రీ మహా గణపతిం




వినాయకుడికి , నాట రాగనికి సంబంధం ఉందని అనిపిస్తుంది నాకు చాల సార్లు..మీరే చూడంది వినాయకుడి మీద ఉన్న పాటలన్ని నాట రాగం లోనే ఉంటాయి.నాట రాగనికి కార్ణాటక సంగీతంలో చాలా ప్రశస్తి ఉంది.
నాట రాగం గురించి నాకు తెల్సిన కొన్ని విషయాలు :-

  • నాట రాగం వేయ్యియెళ్ళ పురాతనమైనది.
  • సంగీత కచేరిలను మొదలు పెట్టెటప్పుడు ముందుగా నాట రాగంతో మొదలు పెట్టడం ఆనవాయితి.
  • పంచరత్న కీర్తనలో ఒక్కటయిన జగదానందకారక నాట రాగంలో కూర్చడం జరిగింది.
  • నాట రాగన్ని ఘన రాగం అని కూడా అంటారు.
ఈ వినయకచవితి అన్ని విఘ్నాలను పొగొట్టలాని ఆశిస్తు ఆ వినాయకుడిని తల్చుకుందాం.ముందుగా నేను కూడా నాటతోనే మొదలు పెడ్తాను .

మహా గణపతిం
రాగం: నాట
తాళం: ఆది
రచన :ముత్తుస్వామీ దిక్షితార్

పల్లవి
*****
మహా గణపతిం మనసా స్మరామి మహా గణపతిం వశిష్ట వామ దేవాది వందిత (మహా)
అనుపల్లవి
********
మహా దేవ సుతం గురుగుహ నుతం మార కోటి ప్రకాశం శాంతం మహా కావ్య నాటకాది ప్రియం మూషిక వాహనా మోదకా ప్రియం

మరి కొంత సంగీతం
అందరికి వినయకచవితి శుభకాంక్షలు

September 04, 2007

కృష్ణాష్టమి

కృష్ణం వందే జగత్గురుం


కృష్ణాష్టమి అంటే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది " కృష్ణాష్టమి అంటే క్రిష్ణుడి బర్త్ డే " అని మన మిస్టెర్ పెళ్ళం సినిమాలోని సన్నివేశం .చిన్నప్పుడు కృష్ణాష్టమి చాల సరదాగా ఉండేది.ఆ రోజు ముందుగా నాకు బాగా ఇష్టమయిన మా నాన్నమ్మ చేసే వంటలు ముఖ్యంగా రకరకాలయిన వడలు..ఆంవడ,పెరుగువడ..ఇంక అటుకులు....

సాయంత్రం మా ఇంట్లో ఇంకా ఇరుగుపొరుగు ఇంట్లో జరిగే పేరంటం.పిల్లలందరం కలిసి అందరికి ఇళ్ళకు వెళ్ళే వాళ్ళం.
ఒక్కక్కరింట్లో ఒకొక్క విధమయిన అలకారం చేసేవాళ్ళు.కొందరు తమ ఇంట్లో ఉండే పిల్లలకి కృష్ణుని వేషం వేసేవళ్ళు.ఇంకా ఇంటి ముందు అ రోజు ముచ్చటగా వేసే కృష్ణుని పాదలు అంటే నాకు చాలా ఇష్టం.మా వీధి చివర్లో ఉట్టి కట్టే వాళ్ళు అది పెద్దవాళ్ళకి కాదు...చిన్న చిన్న పిల్లలకి..వాళ్ళు దాన్ని కొట్టలేక ఆ రంగు నీళ్ళలో తడిసిపొయె వాళ్ళు...చివరగా ఎవరో ఒకరు వాళ్ళని ఎత్తుకోని దాన్ని కొట్టెసేవాళ్ళు.


ఈ రోజు కృష్ణాష్టమి,ఈ సందర్భంలో కృష్ణుని గురించి ఉన్న పాటల్లో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ వినండి :-

a.మొదటగా కృష్ణా నీ బెగనే బారో ,ఇదే పాటని ఉన్ని కృష్ణన్ గాత్రంలో వినండి ఇక్కడ.యమన్ కల్యాణ్ లో చాలా అందంగా కూర్చడం జరిగింది.

KRISHNA NEE BEGANE...

b.తాయే యశోదా

c.భావయామి గోపాలబాలం

d. కృష్ణం కలయ సఖి


Krishnam Kalaya Sa...


e.ముద్దుగారే యశోదా

Muddugare Yashoda....