September 13, 2007

శ్రీ మహా గణపతిం




వినాయకుడికి , నాట రాగనికి సంబంధం ఉందని అనిపిస్తుంది నాకు చాల సార్లు..మీరే చూడంది వినాయకుడి మీద ఉన్న పాటలన్ని నాట రాగం లోనే ఉంటాయి.నాట రాగనికి కార్ణాటక సంగీతంలో చాలా ప్రశస్తి ఉంది.
నాట రాగం గురించి నాకు తెల్సిన కొన్ని విషయాలు :-

  • నాట రాగం వేయ్యియెళ్ళ పురాతనమైనది.
  • సంగీత కచేరిలను మొదలు పెట్టెటప్పుడు ముందుగా నాట రాగంతో మొదలు పెట్టడం ఆనవాయితి.
  • పంచరత్న కీర్తనలో ఒక్కటయిన జగదానందకారక నాట రాగంలో కూర్చడం జరిగింది.
  • నాట రాగన్ని ఘన రాగం అని కూడా అంటారు.
ఈ వినయకచవితి అన్ని విఘ్నాలను పొగొట్టలాని ఆశిస్తు ఆ వినాయకుడిని తల్చుకుందాం.ముందుగా నేను కూడా నాటతోనే మొదలు పెడ్తాను .

మహా గణపతిం
రాగం: నాట
తాళం: ఆది
రచన :ముత్తుస్వామీ దిక్షితార్

పల్లవి
*****
మహా గణపతిం మనసా స్మరామి మహా గణపతిం వశిష్ట వామ దేవాది వందిత (మహా)
అనుపల్లవి
********
మహా దేవ సుతం గురుగుహ నుతం మార కోటి ప్రకాశం శాంతం మహా కావ్య నాటకాది ప్రియం మూషిక వాహనా మోదకా ప్రియం

మరి కొంత సంగీతం
అందరికి వినయకచవితి శుభకాంక్షలు

10 comments:

Bittu10 said...

అద్బుతంగా ఉంది.

కొత్త పాళీ said...

చాన్నాళ్ళ తరవాత సంతానం గారి కమ్మని గొంతు విన్నాను. మా అన్నయ్య దగ్గిర ఎప్పుడో చెన్నైలో జరిగిన ఒక వినాయక చవితి కచేరీ రికార్డింగు ఉండేది - అందులో సంతానం గారు ఆద్యంతం వినాయకుడి కృతులు పాడారు, చాలా అరుదైన కృతులు. శ్రీనివాస్ నాట కూడా చాలా బావుంది.

Bittu10 said...

Wonderful

విహారి(KBL) said...

మీకు వినాయకచవితి శుభాకాంక్షలు

విహారి(KBL) said...

మీకు వినాయకచవితి శుభాకాంక్షలు

విశ్వనాధ్ said...

బాగా రాసారు.

అన్నీ విజయాలే కలగాలని ఆశిస్తూ
వినాయక చతుర్ధి శుభాకాంక్షలు

Madhu...................... said...

Deepti
brief ga chala baga rasaru.

Sriram said...

వినాయక చవితి శుభాకాంక్షలు! నాటరాగాన్ని గుర్తు చేసినందుకు థేంకులు. నేను ఆ మధ్య నాటరాగం గురించి ఇక్కడ రాసాను.

http://sreekaaram.wordpress.com/2007/02/15/%e0%b0%86%e0%b0%aa%e0%b0%be%e0%b0%a4%e0%b0%ae%e0%b0%a7%e0%b1%81%e0%b0%b0%e0%b0%82/

Anonymous said...

మంచి కలెక్షన్స్. బాగున్నాయి. ఆ ఫాస్ట్ బీట్ మహా గణపతిం ఎవరు పాడారు, ఎందులోదో కాస్త చెబుతారా. వినటానికి వెరైటీగా ఉంది.

NSR Murthy said...

దీప్త్రి గారూ! మీ వినాయక చవితి బ్లాగు చాలా అలస్యంగా చూశాను. చాలా బాగుంది. ముఖ్యంగా నాట రాగం గురించిన ప్రస్తావన మిక్కిలి ప్రశంశాపాత్రంగా ఉంది.
నూజిళ్ళ శ్రీరామచంద్రమూర్తి, బెంగుళూరు.