కృష్ణాష్టమి అంటే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది " కృష్ణాష్టమి అంటే క్రిష్ణుడి బర్త్ డే " అని మన మిస్టెర్ పెళ్ళం సినిమాలోని సన్నివేశం .చిన్నప్పుడు కృష్ణాష్టమి చాల సరదాగా ఉండేది.ఆ రోజు ముందుగా నాకు బాగా ఇష్టమయిన మా నాన్నమ్మ చేసే వంటలు ముఖ్యంగా రకరకాలయిన వడలు..ఆంవడ,పెరుగువడ..ఇంక అటుకులు....
సాయంత్రం మా ఇంట్లో ఇంకా ఇరుగుపొరుగు ఇంట్లో జరిగే పేరంటం.పిల్లలందరం కలిసి అందరికి ఇళ్ళకు వెళ్ళే వాళ్ళం.
ఒక్కక్కరింట్లో ఒకొక్క విధమయిన అలకారం చేసేవాళ్ళు.కొందరు తమ ఇంట్లో ఉండే పిల్లలకి కృష్ణుని వేషం వేసేవళ్ళు.ఇంకా ఇంటి ముందు అ రోజు ముచ్చటగా వేసే కృష్ణుని పాదలు అంటే నాకు చాలా ఇష్టం.మా వీధి చివర్లో ఉట్టి కట్టే వాళ్ళు అది పెద్దవాళ్ళకి కాదు...చిన్న చిన్న పిల్లలకి..వాళ్ళు దాన్ని కొట్టలేక ఆ రంగు నీళ్ళలో తడిసిపొయె వాళ్ళు...చివరగా ఎవరో ఒకరు వాళ్ళని ఎత్తుకోని దాన్ని కొట్టెసేవాళ్ళు.
ఈ రోజు కృష్ణాష్టమి,ఈ సందర్భంలో కృష్ణుని గురించి ఉన్న పాటల్లో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ వినండి :-
a.మొదటగా కృష్ణా నీ బెగనే బారో ,ఇదే పాటని ఉన్ని కృష్ణన్ గాత్రంలో వినండి ఇక్కడ.యమన్ కల్యాణ్ లో చాలా అందంగా కూర్చడం జరిగింది.
KRISHNA NEE BEGANE... |
b.తాయే యశోదా
d. కృష్ణం కలయ సఖి
Krishnam Kalaya Sa... |
e.ముద్దుగారే యశోదా
Muddugare Yashoda.... |
1 comment:
బాగున్నాయి పాటల కలెక్షను. థాంకులు.
Post a Comment