తాళం: ఆది
భద్రాచల రామదాసు
పల్లవి
*****
పలుకే బంగార మాయేనా కోదండపాణి (పలుకే)
చరణం 1
పలుకే బంగారమయే పిలచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరవను చక్కనితండ్రి (పలుకే)
చరణం 2
ఇరవుగని సుకలోన పొరలిన యుడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి (పలుకే)
చరణం 3
రాతినాతిగ జేసి భూతలమున ప్రఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి (పలుకే)
ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు పంతము సేయ నేనెంతటి వాడను తండ్రి (పలుకే)
చరణం5
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కాదా కరుణించు భద్రాచల వర రామదాస పోష (పలుకే)
PalukeBagaramayena... |
1 comment:
Namaskaaramandi!!
mee blog choosthunte..letha aritaaku vistharesukuni..vedi vedi annam lo avakaya vennatho kalupuku thinnattundi...
-akella
Post a Comment